వివేకానందుడు తన అవసాన దశ లో కొన్ని రోజులు అద్వైత ఆశ్రమం లో, మాయావతి ఆ తరువాత బేలూర్ మఠం నందు గడిపాడు. ఆపై చివరి వరకు బేలూర్ మఠం లోనే వుంటూ రామకృష్ణ మఠం యొక్క పనులకు మరియు ఇంగ్లాండు, అమెరికా లలో మఠం పనులకు మార్గదర్శకం చేస్తూ గడిపాడు. ఈ సమయం లో వివేకానందున్ని చూడటానికి వేల మంది వచ్చే వారు. 1901 డిసెంబర్ లో గ్వాలియర్ మహారాజు, భారత జాతీయ కాంగ్రెస్ కు విశ్వాసనీయంగా తమ సేవలనందించిన లోకమాన్య తిలక్ తో కూడిన బృందం కూడా వివేకానందున్ని చూడటానికి వచ్చారు. అదే మాసం లో స్వామి వివేకానందుడు జపాన్ లో జరుగుతున్న "కాంగ్రెస్ ఆఫ్ రిలీజియన్స్" సమావేశాలకు ఆహ్వానించ బడ్డారు. కాని అప్పటికే స్వామి వివేకానందుడి ఆరోగ్యం క్షీణిస్తూ సహకరించ లేదు. తన చివరి రోజుల్లో బోధగయా మరియు వారణాసి యాత్రలకు వెళ్ళాడు.
సమ సమాజ స్థాపనకై తను చేపట్టిన ప్రయాణాలు, నిరంతర ప్రసంగాలు, చర్చలు అతని ఆరోగ్యం పై తీవ్ర ప్రభావాన్ని చూపాయి. ఆస్థమా, డయాబెటిస్ లాంటి వ్యాధులు తనను పీడించాయి. అయినా వాటినేమీ లెక్క చేసే వాడు కాదు. తను కొన్ని రోజులలో మృత్యువాత పడతాడు అన్న సమయం లో కూడా తాను చేయవలసిన కార్య ప్రణాళిక ను జాగ్రతగా పరిశీలిస్తూ కనిపించారట. తన మరణమునకు మూడు రోజుల ముందు తనకు శవ దహన కార్యక్రమాలు ఎక్కడ నిర్వర్తించాలో చెప్పారట. ఆ స్థలమే నేడు వివేకానందుని స్మారక స్థలి. తను 40 ఏళ్ళకు పైబదానని తను ఎంతో మందికి చెప్పారట.
తను మరణించిన రోజున కూడా వివేకానందుడు బేలూర్ మఠం లో కొంత మంది విద్యార్థులకు శుక్ల యజుర్వేదాన్ని బోధించారట. తను సోదరుని గ భావించిన స్వామి ప్రేమానంద తో కొద్ది సేపు నడిచి రామకృష్ణ మఠం యొక్క భవిష్య ప్రణాళిక ను తనతో చెప్పారట. చివరికి జూలై 4, 1902 న రాత్రి ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ధ్యానం లో వుంటూనే కాలం చేసాడు. దీనినే మహా సమాధి అంటారు. వివేకానందుని అనుచరులు వివేకానందుని యొక్క ముక్కు రంధ్రాల నుండి, నోటి నుండి మరియు కళ్ళ నుండి కొద్దిగా రక్త స్రావాన్ని గుర్తించారు. వైద్యులు ఇది మెదడు లోని నరాలు చితిలి పోవటం వల్ల అని నిర్ధారణ చేసారు కాని వివేకానందుడు మరణించటానికి తగిన కారణాన్నిమాత్రం గుర్తించ లేక పోయారు. కాని తన అనుచరులు వివేకానందుడు మహాసమాధి ప్రక్రియ లో వున్నప్పుడు "బ్రహ్మ రంధ్రం" పగిలి పోవటం వల్లనే మరణించారు అని నిర్ధారణ చేసారు. అలా తను నలభై ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతకను అని వేస్తూ వచ్చిన అంచనా ను నిజం చేసారు.
No comments:
Post a Comment