నవ నరసింహ :
నరసింహ స్వామి అనేక గ్రంథాలలో అనేక రూపాలతో కొలువబడుతాడు. దాదాపు 74 రూపాలు మనం చూడవచ్చు. ఒక్కొక్క రూపంలో వైవిధ్యమైన భంగిమ లేదా ఆయుధాలతో దర్శనమిస్తారు. అయితే ఇందులో నుండి తొమ్మిది రూపాలకు చాలా ప్రాధాన్యత వుంది. అవి ఈ కింద పేర్కొనబడినవి. మళ్లీ ఇందులో "లక్ష్మీ నరసింహ" రూపం చాలా ప్రసిద్దికెక్కింది
- ఉగ్ర నరసింహ
- క్రోధ నరసింహ
- మాలోల నరసింహ
- జ్వాల నరసింహ
- వరాహ నరసింహ
- భార్గవ నరసింహ
- కరాంజ నరసింహ
- యోగ నరసింహ
- లక్ష్మీ నరసింహ
నిత్య పూజలు మరియు ప్రార్థనలు :
నరసింహ స్వామి ఉగ్ర స్వరూపుడు కావటం చేత, స్వామి వారికి చేసే పూజ, ఇతర పూజలతో పోల్చుకుంటే అత్యంత భక్తి శ్రద్ధలతో కూడినదై వుంటుంది. ఆజన్మ బ్రహ్మచారులు మాత్రమే స్వామి వారికి దేవాలయంనందు నిత్య పూజలు చేయటానికి అర్హులు. కాని యోగా నరసింహుడు మరియు లక్ష్మీ నరసింహులకు మాత్రమే ఎవరైనను నిత్య పూజలు చేసే అవకాశము కలదు. ఎందుచేతనంటే ఈ రెండు రూపాలలో మాత్రమే స్వామి వారు శాంత స్వభావంతో దర్శనమిస్తారు.
స్వామి వారిని ప్రసన్నం చేసుకోటానికి ఎన్నో మంత్రాలు శ్లోకాల రూపంలో ఉపదేశించబడినవి. అవి :
ఓం హ్రీం క్ష్రౌం ఉగ్రం వీరం మహా విష్ణుం
జ్వాలాంతం సర్వతో ముఖం
నృసింహం భీషణం భద్రం
మృత్యు-మృత్యం నమామ్యహం
భావం : ఓ ఉగ్ర భయంకర మహా విష్ణు దేవా, అంతటా నీ అగ్ని జ్వాలలు వ్యాప్తి చెంది వున్నాయి. ఓ ప్రభూ! సమస్తం నీవే వ్యాపించి వున్నావు. మృత్యువు పాలిటి మృత్యువు నీవు, అట్టి నీకు నమస్కరిస్తున్నాను.
ఇతో నృసింహః పరతో నృసింహో
యతో యతో యామి తతో నృసింహః
బహిర్ నృసింహో హృదయే నృసింహో
నృసింహం ఆదిం శరణం ప్రపద్యే
భావం : "నరసింహ స్వామి ఇందు గలడు అందు గలడు. ఎందెందు వెదకినను అందందే గలడు. బాహ్యమందు గలడు హృదయమందు గలడు. ఓ ఆది దేవుడా నీకు శరణం అని మ్రొక్కెద".
తవ కర-కమల-వారే నఖం అద్భుత-సంగం,
దళిత-హిరణ్యకశిపు-తను-భంగం
కేశవ ధాత-నరహరి-రూప జయ జగదీశ హరే
భావం : " పద్మముల వంటి నీ హస్తములకు గల అద్భుతమైన నఖములతో కందిరీగ ను నలిపి నట్లుగా హిరణ్య కశిపుని తనువును చీల్చి వధించి నావు. ఓ కేశవా! జగన్నాయకా! నరహరి! నీకు జయము"
త్వయి రక్షతి రక్షకై హ్ కిం అన్యైహ్ ,
త్వయి ఛ అరక్షతి రక్షకైహ్ కిం అన్యైహ్,
ఇతి నిశ్చిత డీహ్ శ్రయామి నిత్యం, నృహరేహ్ వేగవతే తథాశ్రయం త్వం.
త్వయి రక్షతి రక్షకై హ్ కిం అన్యైహ్ ,
త్వయి ఛ అరక్షతి రక్షకైహ్ కిం అన్యైహ్,
ఇతి నిశ్చిత డీహ్ శ్రయామి నిత్యం, నృహరేహ్ వేగవతే తథాశ్రయం త్వం.
No comments:
Post a Comment