హిందూ ధర్మంలో మొత్తం పద్దెనిమిది పురాణాలు కలవు. ఇవే అష్టాదశ పురాణాలుగా ప్రసిద్ది కెక్కినవి. వీటి రూప కర్త శ్రీ భగవాన్ వేద వ్యాసుడు. వీటన్నింటి లోను ఈ సృష్టి యొక్క ఆవిర్భావం, అంతం మరియు పునః ఆవిర్భావం గురించి చెప్పటం జరిగింది. జగత్తును ప్రళయం నుండి రక్షించటానికి శ్రీ మహా విష్ణువు తన అనేక అవతారాలతో ఎలా రక్షించాడో చెప్పటం జరిగింది. వేదాలు మరియు ఉపనిషత్తుల సారాన్ని కథల రూపం లో అందరికి అర్థమయ్యేలా వర్ణించారు భగవాన్ వేద వ్యాసులు. అంతే గాక హిందూ ధర్మం యొక్క గొప్పతనమును, మనం జరుపుకునే అనేక పండుగల వెనక ఉన్న కారణాలను చక్కగా విశ్లేషించటం జరిగింది. ఈ పద్దెనిమిది పురాణాల పేర్లు క్రింద పేర్కొనడమైనది.
భగవాన్ వేద వ్యాసుడు ఈ అష్టాదశ పురాణాలను మూడు భాగాలుగా విభజించారు. అవి సాత్విక పురాణాలు, రాజసిక పురాణాలు మరియు తామసిక పురాణాలు. అవి సాత్విక పురాణాలు, రాజసిక పురాణాలు మరియు తామసిక పురాణాలు. ఈ పద్దెనిమిది పురాణాల పేర్లు మరియు సాత్విక, రాజసిక, తామస పురాణాల విభజనను పద్మ పురాణమునందలి ఉత్తర కాండ 235 వ అధ్యాయం లో చూడవచ్చు.
సాత్విక పురాణాలు : ఇవి ముఖ్యమైనవి. సాత్విక అనగా స్వచ్చమైనవి / శ్రేష్టమైనవి అని అర్థం. మనిషి జీవన ఔన్నత్యానికి తోడ్పడే శ్రేష్టమైన విషయాలు ఇందులో పొందు పరచబడినవి కాబట్టి వీటిని సాత్విక పురాణాలుగా విభజించటం జరిగింది.

- విష్ణు పురాణం
- నారదీయ పురాణం
- పద్మ పురాణం
- గరుడ పురాణం
- వరాహ పురాణం
- శ్రీమద్ భాగవత మహా పురాణం
రాజసిక పురాణాలు : రాజసిక అనగా "నిస్తేజం చేయు " అని అర్థం. ఈ పురాణాలలో చెప్పబడిన కొన్ని విషయాలు సరైన రీతిలో అవగతం చేసుకోలేనిచో అధర్మ మార్గానికి దారి తీస్తాయి. అందుకనే వీటిని రాజసిక పురాణాలుగా పేర్కొన బడింది.
- బ్రహ్మాండ పురాణం
- బ్రహ్మవైవర్త పురాణం
- మార్కండేయ పురాణం
- భవిష్య పురాణం
- వామన పురాణం
- బ్రహ్మ పురాణం
తామసిక పురాణాలు : తామసి అనగా చీకటి అని అర్థం. ఈ పురాణాలలో చెప్పబడిన అన్ని విషయాలు సరైన రీతిలో అవగతం చేసుకోకున్నచో వినాశనానికి దారి తీస్తాయి.
- మత్స్య పురాణం
- కూర్మ పురాణం
- లింగ పురాణం
- శివ పురాణం
- స్కంద పురాణం
- అగ్ని పురాణం
Upa puranam?
ReplyDelete