తెలవారదేమో స్వామీ ...
తెలవారదేమో స్వామీ ...
నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామీ ...
నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు ఊ .....
తెలవారదేమో స్వామీ ...
చెలువము నేలగ చెంగట లేవని కలత కు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని కలత కు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకూ .......ఊ ...
తెలవారదేమో స్వామీ...
మక్కువ మీరగ అక్కున జేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా
మరి మరి తలచగా
అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకూ .......ఊ ...
తెలవారదేమో స్వామీ...
గామపని తెలవారదేమో స్వామీ...
మీ బ్లాగు చూడ ముచ్చటగా ఉన్నది నానీ!
ReplyDeleteహిందీ సినిమాలలోని భక్తి గీతములను కూడా
పాఠకులకు అందించే ప్రయత్నం చేయగలరా?
ద్విపద రామాయణము- (గోనబుద్ధారెడ్డి రచన)ను
మీ బ్లాగులో రచన చేయగలిగితే,
సాహిత్యప్రియులకు సంతోషం .
ధన్యవాదాలు అనిల్ గారు ....... నా ప్రయత్నం తప్పకుండా చేస్తాను .
ReplyDelete