Thursday, March 22, 2012

శంకరాభరణం - మానస సంచరరే

మానస సంచరరే బ్రహ్మణి మానస సంచరరే
మదశిఖి పింఛాలంకృత చికురే
మదశిఖి పింఛాలంకృత చికురే
మహనీయ కపోలజిత ముకురే
మానస సంచరరే ఏ...
శ్రీ రమణీకుచ శ్రీ శ్రీ శ్రీ రమణీ
శ్రీ రమణీ కుచ దుర్గ విహారే - సేవకజన మందిర మందారే
పరమహంసముఖ చంద్రచకోరే - పరిపూరిత మురళీరవధారే
మానస సంచరరే ఏ ...

శంకరాభరణం - బ్రోచేవారెవరురా

బ్రోచేవారెవరురా…. ఓహో
నిను వినా..నిను వినా
రఘువరా.. రఘువరా
నను బ్రోచేవారెవరురా.......
నిను వినా రఘువరా

నీ చరణాం భుజములునే ...వి....
నీ చరణాం భుజములునే విడజాల కరుణాల వాల
బ్రోచేవారెవరురా.......ఆ ....

ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా
ఓ చతురాననాది వందిత నీకు పరాకేలనయ్యా
ఓ చతురా.. న.. నా.. ది.. వందిత నీకు పరాకేలనయ్యా
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమే
నీ చరితము పొగడలేని నా చింత తీర్చి వరములిచ్చి వేగమే
సా సనిదపద నిస నినిదదపమా పాదమా
గా మా పా దాని సానీదపమా నీదాపమ
గమపద మగరిస
సమా గమపద మాపదని
ససరిని నినిసదా దదనిపాద మపదని
సనిదప మగమనిదని పదమాపదని
సమా గరిస రిసానిదప సానీదపమా గామపదని
బ్రోచేవారెవరురా........

సీతా పతే నాపై నీకభిమానము లేదా
సీతా పతే నాపై నీకభిమానము లేదా
వాతాత్మజార్చిత పాదా .. నా మొరలను విన రాదా
భాసురముగ కరి రాజుని బ్రోచిన వాసు దేవుడవు నీవు కదా
భాసురముగ కరి రాజుని బ్రోచిన వాసు దేవుడవు నీవు కదా
భాసురముగ కరి రాజుని బ్రోచిన వాసు దేవుడవు నీవు కదా
నా పాతకమెల్ల పోగొట్టి గట్టిగ నా ... చేయి పట్టి విడువక
సా సనిదపద నిస నినిదదపమా
పాదమా గా మా పాదాని సానీదపమా నీదాపమ
గమపద మగరిస సమా గమపద మాపాదని
ససరిని నినిసదా దదని పాద మపదని
సానిదప మగమనిదని పదమాపదని
సమా గరిస రిసానిదప సానీదపమా గామపదని
బ్రోచేవారెవరురా......

Thursday, November 10, 2011

భక్తి చిత్ర మాల

కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడి వాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడి వాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు

కుమ్మర దాసుడైన కురువరత్తి నమ్మి
ఇమ్మన్న వరములెల్ల ఇచ్చిన వాడు
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
దొమ్ములు చేసినయట్టి తొండమాన్ చక్కురవర్తి
రమ్మన్న చోటుకి వచ్చి నమ్మిన వాడు
కొండలలో నెలకొన్న ....
గమదని సగమాగ దనిదమ గస
కొండలలో ...
సగసమ గదమని గమగద మనిదసని దమగద మగస
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడి వాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు


ఎదలోని శ్రీ సతి ఎపుడో ఎడబాటు కాగా
ఎనలేని వేదనలో రగిలిన వాడు
మనసిచ్చి పరిణయమాడిన సతి పద్మావతి
మమతల కోవెలలో మసలని వాడు
నీతికి నిలిచిన వాడు దోషిగా మారెను నేడు
ప్రేమకు ప్రాణం వాడు శిక్షకు పాత్రుడు కాదు
ఆర్త రక్షక శ్రీ వెంకటేశ్వరా కరుణతో
తోడు నీడై వాని కాపాడు నేడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడి వాడు
ఆ ... ఆ .....
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడి వాడు
కొండలలో నెలకొన్న కోనేటి రాయడు వాడు
కొండలంత వరములు గుప్పెడి వాడు

Friday, September 16, 2011

తెలవారదేమో స్వామీ...

తెలవారదేమో స్వామీ ...
తెలవారదేమో స్వామీ ...
నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు
తెలవారదేమో స్వామీ ...
నీ తలపుల మునకలో అలసిన దేవేరి అలమేలు మంగకు ఊ .....
తెలవారదేమో స్వామీ ...

చెలువము నేలగ చెంగట లేవని కలత కు నెలవై నిలచిన నెలతకు
చెలువము నేలగ చెంగట లేవని కలత కు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకూ .......ఊ ...
తెలవారదేమో స్వామీ...

మక్కువ మీరగ అక్కున జేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ
మక్కువ మీరగ అక్కున జేరిచి అంగజు కేలిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగా
మరి మరి తలచగా
అలసిన దేవేరి అలసిన దేవేరి అలమేలు మంగకూ .......ఊ ...
తెలవారదేమో స్వామీ...
గామపని తెలవారదేమో స్వామీ...

Monday, September 5, 2011

శ్రీ గణనాథం భజామ్యహం

ఆ... ఆ....
శ్రీ గణనాథం భజామ్యహం
శ్రీ గణనాథం భజామ్యహం
శ్రీ కరం చింతితార్థ ఫలదం
శ్రీ కరం చింతితార్థ ఫలదం
శ్రీ గణనాథం భజామ్యహం
శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
ఆ.. ఆ.. ఆ..
శ్రీ గురు గుహాగ్రజం అగ్ర పూజ్యం
శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం
శ్రీ కంఠాత్మజం శ్రిత సామ్రాజ్యం
శ్రీ గణనాథం భజామ్యహం

రంజిత నాటక రంగ తోషణం
శింజిత వర మణిమయ భూషణం
రంజిత నాటక రంగ తోషణం
ప ద ప రంజిత నాటక రంగ తోషణం
గ మ ప రంజిత నాటక
పదనిస నీదాప రంజిత నాటక
గమా గపా మదప రంజిత నాటక రంగ తోషణం
గపమా పమగా మపరీ సారిగా రం
సాని దాప పామ గారి సారిగా రంజిత నాటక రంగ
పదనిసనీ సనిదప రంజిత నాటక
గమపదని సరి సనిదపమ గారిస రిగ రంజిత నాటక రంగ తోషణం
పదనిసరి సానిదప మపదా పమగా గమపా మగరీ సారిగ
పదనినిసా సరిగమపరిసా నిసరిస నినిదప మపదప మగరిస రిగ రంజిత నాటక రంగ తోషణం
పదనినిసా ఆ... నిసరిసరీ ...
సనిదపమా ...గపమగరీ...
పదనినిసా నిసరిసరీ
సనిదపమా గపమగరీ
సారిసరిగ రిరిపమ గగమప మమపమ దపనీ
దనిసా నిసరీ సనిగమాగ్గా రిగరిరిసని దనీద నిగదపమగ మగారి సరిగమప
రంజిత నాటక రంగ తోషణం
శింజిత వర మణిమయ భూషణం
ఆంజనేయావతారం .... ఆంజనేయావతారం
సుభాషణం కుంజర ముఖం త్యాగరాజ తోషణం
శ్రీ గణనాథం భజామ్యహం
శ్రీ కరం చింతితార్థ ఫలదం
శ్రీ గణనాథం భజామ్యహం

Monday, July 25, 2011

సుందర కాండ గానం - M . S . రామా రావు - రెండవ భాగము

తండ్రి మాట నిలుప రామ చంద్రుడు - వల్కల ధారియై రాజ్యము వీడే 
సీతా లక్ష్మణులు తనతో రాగా - పడునాల్గేండ్లు వనవాసమేగే |
కరదూషనాది పదునాల్గు వేల - అసురుల జంపె జనస్థానమున
అని హనుమంతుడు మృదు మధురముగా - పలికెను సీతా రామ కథా||

రాముడు వెడలె సీత కోర్కె పై - మాయలేడిని కొని తెచ్చుటకై
రామలక్ష్మణులు లేని సమయమున - అపహరించే లంకేశుడు సీతను |
సీతను గానక రామచంద్రుడు - అడవుల పాలై వెదకు చుండెను 
అని హనుమంతుడు మృదు మధురముగా - పలికెను సీతా రామ కథా||

రామ సుగ్రీవులు వనమున కలిసిరి - మిత్రులైరి ప్రతిజ్ఞల పూనిరి
శ్రీ రఘురాముడు వాలిని  కూల్చెను - సుగ్రీవును కపి రాజుని చేసెను |
సుగ్రీవునాన లంక చేరితి - సీతా మాతను కనుగొన గలిగితి
అని హనుమంతుడు మృదు మధురముగా - పలికెను సీతా రామ కథా||

వానరోత్తముడు పలుకుట మానెను - జానకి కెంతో విస్మయ మాయెను 
భయము భయము గా నలువంకలు గని - మెల్లగా మోమెత్తి పైకి జూచెను |
శోభిల్లు శింశుపా శాఖలందున - బాలకుని వలె మారుతి తోచెను 
మారుతి రూపము చిన్నదైనను - తేజోమయమై భీతి గొల్పెను ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా 

తల్లీ తెల్పుము నీవు ఎవరవో - దేవ గంధర్వ కిన్నెరాంగనవో 
కాంతులు మెరసే బంగరు మేన - మలినాంబర మేల దాల్చితివో |
ఓ కమలాక్షి నే కనులో ఈ - నీలాలేల నింపితివో
అని హనుమంతుడు తరువు నుండి దిగి - అంజలి ఘటించి చెంతన నిలిచే ||

రావణాసురుడు అపహరించిన - రాముని సతివో నీవు సీతవో 
రామలక్ష్మణులు వనమున వెదకెడు - అవనీజాతవో నీవు సీతవో |
సర్వ సులక్షణ లక్షిత జాతవు - తల్లీ తెల్పుము నీవు ఎవరవో 
అని హనుమంతుడు సీతతో పలికే - అంజలి ఘటించి చెంతన నిలిచే ||

జనక మహీపతి ప్రియ పుత్రికను - దశరథ మహీపతి పెద్ద కోడలను 
శ్రీ రఘురాముని ప్రియసతి నేను - సీతయను పేర వరలు దానను |
పరిణయమైన పదిరెండేడులు - అనుభవించితిమి భోగ భాగ్యములు
అని పల్కే సీత వానరేంద్రునితో - రామకథను కీర్తించిన వానితో ||

రావణుడు ఒసగిన ఏడాది గడువు - రెండు నెలలలో ఇక తీరిపోవు 
రాముడు నన్ను కాపాడునని - వేచి వేచి వేసారి పోతిని |
అసురులు నన్ను చంపక మున్నే - నాకై నేను పోనెంచితిని
అని పల్కే సీత వానరేంద్రునితో - రామకథను కీర్తించిన వానితో ||

అమ్మా సీతా నమ్ముము నన్ను - రాముని దూతగా వచ్చినాడను 
రామలక్ష్మణులు  క్షేమమన్నారు - నే క్షేమమరసి రమ్మన్నారు |
రాముడు నీకు దీవేనలంపే - సౌమిత్రి నీకు వందనములిడే
అని హనుమంతుడు సీతతో పలికే - అంజలి ఘటించి ముందుకు జరిగే ||

మారుతి ఎంతగా ముందుకు జరిగేనో - జానికి అంతగా అనుమానించెను 
రావణాసురుడే ఈ వానరుడని - కామ రూపుడై వచ్చియుండునని |
ఆశ్రమమున ఒంటిగా నున్న తనను - వంచించిన సన్యాసి ఇతడని
తలవాల్చుకొని భయకంపితయై - కటిక నేలపై జానకి తూలె ||

వానర రాజు సుగ్రీవును మంత్రిని - నన్ను పిలుతురు హనుమంతుడని
రామ సుగ్రీవులు మిత్రులైనారు - నే జాడ తెలియ వేచియున్నారు |
రామలక్ష్మణులు వానర రాజుతో - లంక చేరెదరు వానర కోటితో 
అని హనుమంతుడు సీతతో పలికే - అంజలి ఘటించి చెంతన నిలిచే ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా

ఓ హనుమంతా హాయి పొందితిని - నీ పలికిన శ్రీరామకథ విని 
రామలక్ష్మణుల ఎట్లెరిగితివి? - రూపు రేఖలను ఎట్లు గాంచితివి? |
వారి మాటలను ఎట్లు వింటివి ? - వారి గుణములను ఎట్లు తెలిసితివి?
అని పల్కే సీత హనుమంతునితో - రామ కథను కీర్తించిన వానితో ||

సర్వ జీవన సంప్రీతి పాత్రుడు - కమలనేత్రుడు దయసాంద్రుడు 
బుద్ది యందు బృహస్పతి సముడు - కీర్తి యందు దేవేంద్రుని సముడు |
క్షమా గుణమున పృథ్వీ సముడు - సూర్య తేజుడు శ్రీ రఘు రాముడు 
అని హనుమంతుడు సీతతో పలికే - అంజలి ఘటించి చెంతన నిలిచే ||

అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు - అన్నిటా రాముని సరిపోలు వాడు
అన్నకు తోడు నీడయై చెలగెడు  - అజేయుడు శత్రు భయంకరుడు |
సామాన్యులు గారు సోదరులిరువురు - నిను వెదకుచు మము కలిసినారు 
అని హనుమంతుడు సీతతో పలికే - అంజలి ఘటించి చెంతన నిలిచే ||

పవన కుమారుని పలుకులను విని - అతడు నిజముగా రామదూత యని 
ఆనందాశ్రులు కన్నులు నిండగా - చిరు నగవులతో జానకి చూడగా |
ఇదుగో తల్లీ ఇది తిలకింపుము  - రాముడంపిన అంగుళీయకము 
అని హనుమంతుడు భక్తి మీరగను - అంగుళీయకమును సీతకొసగెను || 

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా 

రామచంద్రుని ముద్రిక చేకొని - అశ్రులు నిండిన కనులకత్తుకొని 
మధుర స్మృతులు మదిలో మెదల - సిగ్గుచేత తన శిరము వంచుకొని |
ఇన్ని రోజులకు తనకు కలిగిన - శుభశకునముల విశేషమనుకొని
జానకి పల్కే హనుమంతునితో - సంపూర్ణ మైన విశ్వాసముతో ||

ఎన్నడు రాముడు ఇట కేతెంచునో  - ఎన్నడు రావణుని హతము సేయునో 
లక్ష్మణుండు తన అగ్ని శరముల - క్రూర రాక్షసుల రూపు మాపునో |
సుగ్రీవుడు తన వానర సేనతో - చుట్టుముట్టి ఈ లంకను గూల్చునో 
అని పల్కే సీత హనుమంతునితో - సంపూర్ణ మైన విశ్వాసముతో ||

రామలక్ష్మణులు వచ్చు దాకను - బ్రతుక నిత్తురా అసురులు నన్ను 
రావణుడొసగిన ఏడాది గడువు - రెండు నెలలలో ఇక తీరి పోవు |
ప్రాణములను అరచేత నిల్పుకొని - ఎదురు చూతునీ రెండు మాసములు 
అని పల్కే సీత హనుమంతునితో - సంపూర్ణ మైన విశ్వాసముతో ||

నీవలె నే శ్రీరామచంద్రుడు - నిద్రాహారములు మరచెనమ్మా
ఫలపుష్పాదులు ప్రియమైనవి గని - హా సీతా యని శోకించునమ్మా | 
నీ జాడ తెలిసి కోదండపాణి - తడవు సేయకే రాగలడమ్మా
అని హనుమంతుడు సీతతో పల్కే - అంజలి ఘటించి చెంతన నిలిచే || 

ఓ హనుమంతా నిను గనినంతా - నాలో కలిగే ప్రశాంతత కొంత 
వానరోత్తమా నిను వినినంతా - నే పొందితిని ఊరట కొంత |
రాముని వేగమే రమ్మని తెల్పుము - రెండు నెలల గడువు మరువ బోకుము
అని పల్కే సీత హనుమంతునితో - సంపూర్ణ మైన విశ్వాసముతో ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా

తల్లీ నీవిటు శోకింపనేల? - వగచి వగచి ఇటు భీతిల్లనేల?
ఇపుడే నీకీ చేరే విడిపింతును - కూర్చుండుము నా మూపు మీదను |
వచ్చిన త్రోవనే కొని పోయెదను - శ్రీ రామునితో నిను చేర్చెదను
అని హనుమంతుడు సీతతో పల్కే - అంజలి ఘటించి చెంతన నిలిచే ||

పోనివ్వక పోతివిగా హనుమా - సహజమైన నే చంచల భావము 
అరయగ అల్ప శరీరుడవీవు - ఏ తీరుగా నను గొని పోగలవు? |
రాముని కడకే నను చేర్చేదవో - కడలి లోననె జార విడుతువో 
అని పల్కే సీత హనుమంతుని తో - తనలో కల్గిన వాత్సల్యముతో||

సీత పలికిన మాటల తీరును - హనుమంతుడు విని చిన్న బోయెను 
సీత చెంత తన కామ రూపమును - ప్రదర్శింపగా  సంకల్పించెను |
కొండంతగా తన కాయము పెంచెను - కాంతి వంతుడై చెంత నిలిచెను 
జయ హనుమంతుని కామ రూపమును - ఆశ్చర్యముతో జానకి చూచెను ||

అద్భుతమౌ నీ కామ రూపమును - కాంచితినయ్యా శాంతిమపుమయ్యా
పవనకుమారా నీవు గాక మరి - ఎవరీ వారిధి దాటెదరయ్యా |
క్రూర రాక్షసుల కంట బడకయే - లంక వెదకి నను కన గలరయ్యా 
అని పల్కే సీత హనుమంతుని తో - సంపూర్ణమైన విశ్వాసముతో ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా

తల్లీ నేను నీయందు గల భక్తి భావమున అటుల తెల్పితి
క్రూర రాక్షసుల బారి నుండి నిను కాపాడ నెంచి అటుల పల్కితి |
వేగమే నిన్ను రాముని జేర్చు శుభ ఘడియలకై త్వరపడి పల్కితి 
అని హనుమంతుడు సీతతో పల్కే అంజలి ఘటించి చెంతన నిలిచే ||

తల్లీ నీవు తెలిపిన వన్నీ శ్రీ రామునకు విన్నవించెద 
సత్య ధర్మ పవిత్ర చరిత్రవు శ్రీ రామునకు తగిన భార్యవు |
అమ్మా ఇమ్ము ఏదో గురుతుగా శ్రీరాముడు గని ఆనందింపగా 
అని హనుమంతుడు సీతతో పల్కే అంజలి ఘటించి చెంతన నిలిచే ||

చిత్ర కూటమున కాకాసురు కథ కన్నీరొలుకగా గురుతుగా తెలిపి 
చెంగుముడినున్న చూడామణిని మెల్లగా తీసి మారుతి కొసగి |
పదిలముగా కొని పోయిరమ్మని శ్రీ రామునకు గురుతుగ నిమ్మని
ప్రీతీ పల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో || 

చేతులారగ చూడామణి గొని ఆనందముగా కనులకద్దుకొని 
వైదేహికి ప్రదక్షిణలు చేసి పదముల వ్రాలి వందనములిడి |
మనమున రాముని ధ్యానించుకుని మరలి పోవగా అనుమతి గైకొని 
అంజనీ సుతుడు కాయము పెంచే ఉత్తర దిశగా కుప్పించి ఎగసే ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా 

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా

సీత జాడ గని మరలిన చాలదు చేయవలసినది ఇంకను గలదు 
కల్పించుకుని కలహము పెంచేద అసుర వీరుల పరిశీలించెద |
రాక్షస బలముల శక్తి గ్రహించెద సుగ్రీవాదులకు విన్నవించెద 
అని హనుమంతుడు యోచన చేయుచు తోరణ స్తంభము పైన నిలిచెను ||

పద్మాకరముల పాడొనరించి జలాశయముల గట్టులు త్రెంచి 
ఫల వృక్షముల నేలను గూల్చి ఉద్యానముల రూపును మాపి |
ప్రాకారముల బ్రద్దలు చేసి ద్వార బంధముల ధ్వంసము చేసి 
సుందరమైన అశోక వనమును చిందర వందర చేసే మారుతి ||

మృగసమూహములు భీతిల్లినవై దద్దరపాటుగా పరుగులు తీయగా 
పక్షుల గుంపులు చెల్లా చెదురై దీనారవముల ఎగిరి పోవగా |
సీత యున్న శింశిపా తరువు మినః వనమంతయు వినాశము కాగా
సుందరమైన అశోక వనమును చిందర వందర చేసే మారుతి ||

వనమున రేగిన ధ్వనులకు అదిరి లంకా వాసులు నిద్ర లేచిరి 
కావలి యున్న రాక్షస వనితలు రావను చేరి విన్నవించిరి |
దశకంఠుడు మహోగ్రుడై పలికే ఆ వానరుని బట్టి దండింపుడనే 
ఎనుబది వేల కింకర వీరులు హనుమంతునిపై దాడి వెడలిరి ||

ఎనుబది వేల కింకర వీరుల ఒక్క వానరుడు హతము చేసెను 
ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు గర్జన చేసెను |
జంబుమాలిని తగిన బలము గొని ఆ వానరుని దండింప బొమ్మనెను
జంబుమాలి ప్రహస్తుని సుతుడు హనుమంతుని పై దాడి వెడలెను ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా

జంబుమాలిని సర్వ సైన్యమును ఒక్క వానరుడు ఉక్కడగించెను
ఈ వృత్తాంతము వినిన రావణుడు నిప్పులు గ్రక్కుచు ఆజ్ఞాపించెను |
మంత్రి కుమారుల తగిన బలము గొని ఆ వానరుని దండింపగా   పొమ్మనే 
మంత్రి కుమారులు ఏడ్గురు  చేరి హనుమంతుని పై దాడి వెడలిరి ||

మంత్రి సుతులను సర్వ  సైన్యమును మారుతి త్రుటి లో సంహరించెను 
ఎటు జూచిననూ మృత దేహములు ఎటు పోయిననూ రక్తపుటేరులు |
ఈ వృత్తాంతము వినిన రావణుడు కొంత తడవు యోచించి పల్కేను 
సీనాపతులను తగిన బలము గొని ఆ వానరుని దండింప పొమ్మనెను ||

సేనాపతులను సర్వ సైన్యమును పవన కుమారుడు నిర్మూలించెను 
ఈ వృత్తాంతము వినిన రావణుడు నిశ్చేష్టితుడై పరివీక్షించెను |
తండ్రి చూపులు తనపై సోకగా అక్ష కుమారుడు ఇతవుగ నిలువగా 
రావణుడు పలికే కుమారుని గని ఆ వానరుని దండింపగా పొమ్మని ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా

అక్షకుమారుడు నవ యవ్వనుడు వేగవంతుడు తేజోవంతుడు 
దివ్యాస్త్రములను పొందిన వాడు మణిమయ స్వర్ణ కిరీట శోభితుడు |
కాలాగ్ని వోలె ప్రజ్వరిల్లెడు రణధీరుడు మహా వీరుడు 
అక్ష కుమారుడు దివ్య రథముపై దాడి వెడలెను హనుమంతుని పై ||

మూడు శరములతో మారుతి శిరమును పది శరములతో మారుతి ఉరమును 
అక్ష కుమారుడు బలముగా నాటెను రక్తము చిందగా గాయ పరచెను |
ఉదయ భాస్కర సమాన తేజమున మారుతి ఎగసే గగన మార్గమున 
ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున ||

అతి నేర్పు తోడ రణము సల్పెడు అక్ష కుమారుని మారుతి దయగొని 
బాలుని చంపగా చేతులు రావని వేచి చూచెను నిగ్రహించుకొని |
అక్ష కుమారుడు అంతకంతకును అగ్నిహోత్రుడై రణమున రేగెను 
ఇరువురి నడుమ భీకరమైన పోరు చెలరేగే ఆకాశమున ||

అగ్ని కణమని జాలి కూడదని రాగులక మునుపే ఆర్పుట మేలని 
సింహ నాదమును మారుతి చేసెను అరచేత చరచి హయముల చంపెను |
రథమును బట్టి విరిచి వేసెను అక్షుని త్రుంచి విసరి వేసెను 
అక్షుని మొండెము అతి ఘోరముగా నేలపై బడే రక్తపు ముద్దగా ||

అక్ష కుమారుని మరణవార్త విని లంకేశ్వరుడు కడు దుఃఖించెను 
మెల్లగా తేరి క్రోధము పూని తన కుమారుని ఇంద్రజిత్తు గని |
ఆ వానరుడు సామాన్యుడు గాడని వానిని వేగ బంధించి తెమ్మని 
రావణాసురుడు ఇంద్రజిత్తును హనుమంతునిపై దాడి పంపెను ||

కపికుంజరుడు భయంకరముగా కాయము పెంచి సమరము సేయగా 
ఈ వానరుడు సామాన్యుడు కాదని మహిమోపేతుడు కామరూపుడని |
ఇంద్రజిత్తు బహు యోచన చేసి బ్రహ్మాస్త్రమును ప్రయోగము చేసే 
దేవ గణంబులు సంగ్రామము గని తహతహలాడిరి ఏమగునో యని ||

కట్టుపడియున్న వానరోత్తముని అసురులు తలచిరి తమకు లొంగెనని 
త్వరత్వరగా దానవులు దరిచేరి నారే చీరలతో బిగి బంధించిరి |
బ్రహ్మ వరమున బ్రహ్మాస్త్ర బంధము క్షణ కాలములో తొలగి పోయెను 
మారుతి మాత్రము నారె చీరలకు కట్టుపడినటుల కదలకయుండే ||

వానరోత్తముని దూషణలాడుచు రావణుని కడకు ఈడ్చుకు పోవగా 
ఈ వానరుని వధించి వేయుడని మనయెడ ద్రోహము చేసినాడని |
రక్త నేత్రముల నిప్పులు రాలగ లంకేశ్వరుడు గర్జన సేయగా 
రావణు తమ్ముడు విభీషణుడు దూతను చంపుట తగదని తెల్పెను ||

శ్రీ హనుమాను గురు దేవులు నా ఎద పలికిన సీతా రామ కథా 
నే పలికెద సీతా రామ కథా 

అన్నా రావణ తెలిసిన వాడవు శాంతముగా నా మనవిని వినుమా
దూతను చంపుట ధర్మము గానిది లోకముచే గర్హింప బడునది |
శూరుడవైన నీకు తగనిది రాజ ధర్మ విరుద్ధ మైనది 
అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపే ||

అన్నా వీనిని వధింపకుమా తగురీతిని దండించి పంపుమా
దూత యెడల దండింప బడినవి వధ గాక తగు దండనలున్నవి | 
తల కొరిగించుట సబుకు వేయుట గురుతు వేయుట వికలాంగు సీయుట 
అని విభీషణుడు లంకేశునితో దూతను చంపుట తగదని తెలిపే ||

శ్రీ హనుమాను గురు దేవులు నా ఎద పలికిన సీతా రామ కథా 
నే పలికెద సీతా రామ కథా

కపులకు వాలము ప్రియ భూషణము కావున కాల్చుడు వీని వాలము 
వాడవాడల ఊరేగింపుడు పరాభవించి వదలి వేయుడు |
కాలిన తోకతో వీడేగు గాక అంపిన వానికి తలవంపు కాగ
అని రావణుడు విభీషణుని గని ఆజ్ఞాపించెను కోపమనచుకొని ||

చీర్ణాంబరములు అసురులు తెచ్చిరి వాయు కుమారుని తోకకు చుట్టిరి 
నూనెతో తడిపి నిప్పంటించిరి మంటలు మండగ సంతసించిరి |
కపికుంజరుని ఈడ్చుకుబోయిరి నడివీదులలో ఊరేగించిరి
మారుతి మాత్రము మిన్నకుండెను సమయము కాదని సాగిపోయెను ||

కపిని బంధించి తోక గాల్చిరని నడివీదులలో త్రిప్పుచుండిరని
రాక్షస వనితలు వేడుక మీరగ పరుగున బోయి సీతకు తెలుపగా |
అంతటి ఆపద తనమూలమున వాయు సుతునకు వాటిల్లెనని 
సీతామాత కాదు చింతించెను అగ్ని దేవుని ప్రార్థన చేసెను ||

ఓర్వరానివై మండిన మంటలు ఒక్కసారిగా చల్లగా తోచెను 
అగ్ని దేవునకు నా జనకునకు అన్యోన్యమైన మైత్రి చేతనో |
రామదూతనై వచ్చుట చేతనో సీతామాత మహిమ చేతనో 
మండే జ్వాలలు పిల్ల గాలులై నిల్వ సాగేనని మారుతి పొంగెను ||

ఆనందముతో కాయము పెంచెను బంధములన్ని తెగిపడి పోయెను 
అడ్డగించిన అసురలన్దరిని అరచేత చర్చి అట్టడగించెను |
గిరిశిఖరము వలె ఎత్తుగనున్న నగరద్వార గోపురమందున 
స్థంభము పైకి మారుతి ఎగసెను లంకా పురిని పరివీక్షించెను ||

శ్రీ హనుమాను గురు దేవులు నా ఎద పలికిన సీతా రామ కథా 
నే పలికెద సీతా రామ కథా

ఏ మంటల నా వాలము గాల్చిరో ఆ మంటలనే లంక గాల్తునని 
భీమరూపుడై గర్జన సేయుచు రుద్రరూపుడై మంటల జిమ్ముచు |
మేడమిద్దెల వనాల భవనాల వెలిగించెను జ్వాలా తోరణాల 
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించే మారుతి ||

ఒకచో కుంకుమ కుసుమ కాంతుల ఒకఎడ బూరుగు పుష్పచ్చాయల 
ఒకచో మోదుగు విరుల తేజముల ఒకఎడ కరగిన లోహపు వెలుగుల |
కోటి సూర్య సమాన కాంతుల లంకాపురము రగిలెను మంటల 
చూచి రమ్మనిన కాల్చి వచ్చిన ఘన విఖ్యాతి గణించే మారుతి ||

శ్రీ హనుమాను గురు దేవులు నా ఎద పలికిన సీతా రామ కథా 
నే పలికెద సీతా రామ కథా 

హనుమంతుడు సముద్ర జలాల చల్లర్చుకునే లాంగూల జ్వాల 
తలచిన కార్యము నెరవేర్చితినని తేరి పార జూచే వెనుకకు తిరిగి |
కనిపించెను ఘోరాతి ఘోరము జ్వాలాభీలము లంకా పురము 
మారుతి వగచే తా చేసిన పనిగని తన కోపమే తన శత్రువాయేనని ||

సీతామాత క్షేమము మరచితి కోప తాపమున లంక దహించితి
లంకాపురము సర్వము పోగా ఇంకా జానకి మిగిలి ఉండునా | 
సిగ్గుమాలిన స్వామీ ద్రోహిని సీతను చంపినా మహా పాపిని 
మారుతి వగచే తా చేసిన పనిగని తన కోపమే తన శత్రువాయేనని ||

సీత లేనిదే రాముడుండడు రాముడు లేనిదే లక్ష్మణుడుండడు
భరతశత్రుఘ్న సుగ్రీవాదులు ఈ దుర్వార్త విని బ్రతుక జాలరు |
ఈ ఘోరమునకు కారణమైతిని నాకు మరణమే శరణ్యమని 
మారుతి వగచే తా చేసిన పనిగని తన కోపమే తన శత్రువాయేనని ||

శ్రీ రఘురాముని ప్రియసతి సీతా అగ్ని వంటి మహా పతివ్రత 
అగ్నిని అగ్ని దహింప నేర్చునా ? అయోనిజను అగ్ని దహించునా ?
నను కరుణించిన అగ్ని దేవుడు సీతను చల్లగా చూడకుండునా !
అని హనుమంతుడు తలచు చుండగా శుభశకునములు  తోచే ప్రీతిగా ||

ఎల్ల రాక్షసుల సిరిసంపదలు మంటల పాలై దహనమాయేనని
అశోక వనము ద్వంసమైనను జానకి మాత్రము క్షేమమేనని |
లంకాపురము రూపుమాసినను విభీషణుని గృహము నిలిచియుండేనని
అంబర వీధిని సిద్ధ చారణులు పలుకగా విని మారుతి పొంగెను ||

శ్రీ హనుమాను గురు దేవులు నా ఎద పలికిన సీతా రామ కథా 
నే పలికెద సీతా రామ కథా

అశోక వనము మారుతి చేరెను ఆనందాశ్రువుల సీతను గాంచెను 
తల్లీ నీవు నా భాగ్యవశమున క్షేమమున్టివని పదముల వ్రాలెను |
పోయి వత్తునిక సెలవునిమ్మని అంజలి ఘటించి చెంత నిలిచెను 
సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో ||

హనుమా అతులిత బలధామా శత్రుకర్షనా శాంతి నిదానా 
ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమర్థుడ వీవే |
రాముని వేగమే తోడ్కొని రమ్ము రాక్షస చెర నాకు తొలగింపుము 
అని పల్కే సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసముతో ||

తల్లీ నిన్ను చూచినదాదిగా త్వరపడుచుంటిని మరలి పోవగా 
భీతి నొందకుము నేమ్మదినుండుము త్వరలో నీకు శుభములు కలుగు |
రామలక్ష్మణసుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను
అని మారుతి సీత పదముల వ్రాలె సెలవు గైకొని రివ్వున మరలె ||

శ్రీ హనుమాను గురు దేవులు నా ఎద పలికిన సీతా రామ కథా 
నే పలికెద సీతా రామ కథా 

అరిష్టమను గిరిపై నిలిచి మారుతి ఎగసెను కాయము పెంచి 
పవన కుమారుని పదఘట్టనకే పర్వతమంతయు పుడమిని క్రుంగె |
సీతను గాంచిన శుభవార్త వేగ శ్రీరామునకు తెలియచేయగా 
మారుతి మరలెను అతి వేగముగా ఉత్తర దిశగా వారిథి దాటగా ||

గరుడుని వోలె శర వేగముగా పెద్ద పెద్ద మేఘాలు దాటుకొని
మార్గ మధ్యమున మైనాకుని గని ప్రేమ మీరగా క్షేమము కనుగొని |
దూరము నుండి మహేంద్ర గిరిని ఉత్సాహముగా ముందుగా గని 
విజయ సూచనగా గర్జన సేయుచూ మారుతి సాగెను వేగము పెంచుచు ||

సుందరమైన మహేంద్ర గిరి పైన సెలయేట దిగి స్నానమాడి 
జాంబవదాది  పెద్దలందరికీ వాయునందనుడు వందములిడి |
చూచితి సీతను చూచితి సీతను అను శుభ వార్తను ముందుగ పలికెను 
కపి వీరులు హనుమంతుని పొగడిరి ఉత్సాహమున కిష్కింధకు సాగిరి ||

జాంబవదంగద హనుమదాదులు ప్రసవన గిరి చేరుకొనినారు
రామలక్ష్మణసుగ్రీవాదులకు వినయముతో  వందనములిడినారు |  
ఆంజనేయుడు శ్రీరామునితో చూచితి సీతనను శుభవార్త తెలిపే 
చూడామణిని శ్రీరామునకిడి అంజలి ఘటించి చెంతన నిలిచే ||

శ్రీ హనుమాను గురు దేవులు నా ఎద పలికిన సీతా రామ కథా 
నే పలికెద సీతా రామ కథా

చూడామణిని రాముడు గైకొని తన హృదయానికి చేర్చి హత్తుకొని 
మాటలు రాని ఆనందముతో అశ్రులు నిండిన నయనాలతో |
హనుమా సీతను ఎట్లు గాంచితివి ఎట్లున్నది సీత ఏమి తెల్పినది ?
అని పల్కిన శ్రీ రామచంద్రునకు మారుతి తెలిపే తన లంకాయానము ||

శతయోజనముల వారిథి దాటి లంకాపురమున సీతను గాంచితి 
రాళ్ళు కరుగగా సీత పలుకగా నా గుండెల క్రోధాగ్ని రగులగా |
అసురుల గూల్చితి లంక గాల్చితి రావణునితో సంవాదము సల్పితి 
అని మారుతి తన లంకా యానమును రామచంద్రునకు విన్నవించెను ||

నిరతము నిన్నే తలచుచున్నది క్షణమొక యుగముగా గడుపుచున్నది 
రెండు నెలల గడువు తీరక మునుపే వేగమే వచ్చి కాపాడుమన్నది |
రామ లక్ష్మణ సుగ్రీవాదులకు సీత క్షేమమని తెలుపమన్నది 
అని మారుతి తన లంకా యానమును రామచంద్రునకు విన్నవించెను ||

రామలక్ష్మణుల భుజములనిడుకొని వేగమే లంకకు గొనివత్తునని
రామలక్ష్మణుల రావణాదులు కూలుట నిజమని |
ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపి నే మరలి వచ్చితి 
అని మారుతి తన లంకా యానమును రామచంద్రునకు విన్నవించెను ||

అందరు కలసి అయోధ్యకు చేరి ఆనందముగా సుఖించేదరని 
సీతారామ పట్టాభిషేకము కనులపండువుగా జరిగి తీరునని |
ఎన్నో రీతుల సీతామాతకు ధైర్యము గొలిపి నే మరలి వచ్చితి 
అని మారుతి తన లంకా యానమును రామచంద్రునకు విన్నవించెను ||

ఆనందముతో అశ్రులు జారగా సీతా మాత నను దీవించగా 
పదముల వ్రాలి నే పయనమైతిని పదములు రాకనే మరలి వచ్చితి |
ఒప్పలేదు గాని ఎపుడో తల్లిని భుజముల నిడుకొని కొని రాకుందునా ?
అని మారుతి తన లంకా యానమును రామచంద్రునకు విన్నవించెను ||

శ్రీ హనుమాను గురు దేవులు నా ఎద పలికిన సీతా రామ కథా 
నే పలికెద సీతా రామ కథా

సీత క్షేమమను శుభవార్త నేడు మారుతి నాకు తెల్పకుండిన 
నేటి తోడ మా రఘుకులమంతా అంతరించి యుండెడిది కదా |
మమ్మీ తీరుగా ఉద్ధరించిన మారుతికి ఏమివ్వగలనని
సర్వమిదేనని కౌగిట చేర్చెను హనుమంతుని ఆజానుబాహుడు ||

శ్రీ హనుమాను గురు దేవులు నా ఎద పలికిన సీతా రామ కథా 
నే పలికెద సీతా రామ కథా 

నలుగురు శ్రద్ధతో ఆలకించగా నలుగురు భక్తితో ఆలపించగా 
సీతారామ హనుమానులు సాక్షిగా సర్వజనులకు శుభములు కలుగగ 
కవికోకిల వాల్మీకి పలికిన రామాయణమును తేట తెలుగునా 
శ్రీ గురుచరణా సేవా భాగ్యమున పలికెద సీతా రామ కథా 

శ్రీ హనుమాను గురు దేవులు నా ఎద పలికిన సీతా రామ కథా 
నే పలికెద సీతా రామ కథా 

మంగళ హారతి గొను హనుమంతా సీతారామ లక్ష్మణ సమేత 
నా అంతరాత్మ నిలుమో అనంతా నీవే అంతా శ్రీ హనుమంతా 
ఆ .. ఆ ....

Thursday, July 21, 2011

సుందర కాండ గానం - M . S . రామా రావు - మొదటి భాగము

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నీ పలికెద సీతారామకథా 

శ్రీ హనుమంతుడు అంజనీ సుతుడు - అతి బలవంతుడు రామ భక్తుడు
లంకకు పోయి రాగల ధీరుడు - మహిమోపేతుడు శత్రు ఘర్షణుడు |
జాంబవదాది వీరులందరును - ప్రేరేపింపగా సమ్మతించెను
లంకేశ్వరుడు అపహరించిన - జానకీ మాత జాడ తెలిసికొన ||

తన తండ్రి యైన వాయుదేవునకు - సూర్య చంద్ర బ్రహ్మాది దేవులకు 
వానరేంద్రుడు మహేంద్రగిరిపై - వందనములిడే పూర్వాభిముఖుడై |
రామ నామమున పరవశుడయ్యే - రోమరోమమున పులకితుడయ్యే
కాయము పెంచే కుప్పించి ఎగసే - దక్షిణ దిశగా లంక చేరగా ||

పవన తనయుని పద ఘట్టనకే - పర్వత రాజము గడ గడ వణకే
ఫలపుష్పాదులు జల జల రాలే - పరిమళాలు గిరి శిఖరాలు నిండే |
పగిలిన శిలల ధాతువులెగసే  - రత్న కాంతులు నలు దిసల మెరసే
గుహలను దాగిన భూతములదిరే - దీనారవముల పరుగిడే బెదిరీ ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నీ పలికెద సీతారామకథా 

రఘుకులోత్తముని రామచంద్రుని - పురుషోత్తముని పావన చరితుని 
నమ్మినబంటుని అనిలాత్మజుని - శ్రీ హనుమంతుని స్వాగతమిమ్మని |
నీకడ కొంత విశ్రాంతి తీసికొని - పూజలందుకొని పోవచ్చునని 
సగర ప్రవర్దితుడు సాగరుడెంతో - ముదమున పలికే మైనాకునితో ||

మైనాకుడు ఉన్నతుడై నిలిచే - హనుమంతుడు ఆగ్రహమున గాంచె
ఇది ఒక విఘ్నము కాబోలునని - వారిథి పడద్రోసే పురము చేగిరిని |
పర్వత శ్రేష్టుడా పోటున క్రుంగే - పవన తనయుని బలము గని పొంగే
తిరిగి నిలిచే హనుమంతుని పిలిచే - తన శిఖరము పై నరుని రూపమై ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నీ పలికెద సీతారామకథా 

వానరోత్తమా ఒకసారి నిలుమా - నా శిఖరాల శ్రమ తీర్చుకొనుమా
కందమూలములు ఫలములు తినుమా - నా పూజలు గొని మన్నన లందుమా|
శతయోజనముల పరిమితముగల జలనిదినవలీల దాటిపోగల 
నీదు మైత్రి కడు ప్రాప్త్యము నాకు - నీదు తండ్రి కడు పూజ్యుడు నాకు ||

పర్వతోత్తముని కరమున నిమిరి - పవన తనయుడు పలికెను ప్రీతిని 
ఓ గిరీంద్రమా సంతసించితిని - నీ సత్కారము ప్రీతినందితిని |
రామ కార్యమై యేగుచుంటిని - సాధించు వరకు ఆగనంటిని
నే పోవలె క్షణమెంతో విలువలే - నీ దీవెనలే నాకు బలములే||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నీ పలికెద సీతారామకథా 
అనాయాసముగా అంబర వీధిని - పయనము చేసేడు పవన కుమారుని 
ఇంద్రాదులు మహర్షులు సిద్ధులు - పులకాంకితులై ప్రస్తుతించిరి |
రామకార్యమతి సాహసమ్మని - రాక్షసబలమతి భయంకరమని 
కపివరుడెంతటి ఘనకరుడోయని - పరిశీలనగా పంపిరి సురసని ||

ఎపుడో నన్ను నిన్ను మ్రింగమని - వరమొసగి  మరీ బ్రహ్మ పంపెనని 
అతిగా సురస నోటిని తెరచే - హనుమంతుడలిగి కాయము పెంచే |
ఒకరినొకరు మించి కాయము పెంచిరి - శతయోజనములు విస్తరించిరి
పైనుండి సురలు తహతహ లాడిరి - ఇరువురిలో ఎవ్వరిదో గెలుపనిరి ||

సురస మొఖము విశాలమౌట గని - సూక్ష్మ బుద్దిగొని సమయమిదేనని
క్షణములోన అంగుష్ఠ మాత్రుడై - ముఖము జొచ్చి వెలివచ్చే  విజయుడై |
పవన కుమారుని సాహసము గని - దీవించే సురస నిజరూపము గొని 
నిరాలంబ నీలాంబరము గనుచు - మారుతి సాగెను వేగము పెంచుచు ||

జలనిధి తేలే మారుతి చాయను రాక్షసి సింహిక అట్టే గ్రహించెను 
గుహను పోలు తన నోటిని తెరచెను - కపివరుని గుంజి మ్రింగ జూచెను |
అంతట మారుతి సూక్ష్మ రూపమున - సింహిక ముఖమును చ్రొచ్చి చీల్చెను
సింహిక హృదయము చీలికలాయెను - సాగరమున బడి అసువులు బాసెను ||

వారిథి దాటెను వాయుకుమారుడు - లంక చేరెను కార్య శూరుడు
నలు వంకలను కలయ జూచుచూ - నిజ రూపమున మెల్లగా సాగుచూ |
త్రికూటాచల శిఖరము పైన - విశ్వకర్మ వినిర్మితమైన 
స్వర్గ పురముతో  సమానమైన - లంకాపురమును మారుతి గాంచెను ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నీ పలికెద సీతారామకథా 

అనిలకుమారుడా రాత్రి వేళలను - సూక్ష్మ రూపుడై బయలు దేరెను
రజనీకరుని వెలుగు చేతను - రజనీచరుల కంట బడకను |
పిల్లివలె పొంచి మెల్లగా సాగెను - ఉత్తర ప్రాకార ద్వారము చేరెను
లంకా రాక్షసి కపివరు గాంచెను - గర్జన సేయుచు అడ్డగించెను ||

కొండకోనల తిరుగాడు కోతివి ఈ పురికి ఈ పనికి వచ్చితివి 
లంకేశ్వరుని ఆనతిమేర - లంకాపురికి కావలి యున్న |
లంకను నేను లంకాధి దేవతను - నీ ప్రాణములను నిలువున దీతును 
కదలక మెదలక నిజము పల్కుమని - లంక ఎదుర్కొనే కపి కిశోరుని ||

అతి సుందరమీ లంకా పురమని - ముచ్చటపడి నే చూడవచ్చితిని
ఈ మాత్రమునకు కోపమెందుకులే - పురము గాంచి నీ మరలి పోదులే |
అని నెమ్మదిగా పలుకగా విని - అనిలాత్మజుని చులకనగా గొని 
లంకా రాక్షసి కపి కిశోరుని - గర్జించి కసరి గద్దించి చరచెను||

సింహనాదమును మారుతి చేసే - కొండతగా తన కాయము పెంచే
వామహస్తమున పిడికిలి బిగించే - ఒకే పోటున లంకను గూల్చె |
కొండబండలా రక్కసి డొల్లె - కనులప్పగించి నోటిని తెరచే 
అబలను చంపుట ధర్మము కాదని - లంకను విడిచే మారుతి దయగొని ||

ఓ బల భీమా వానరోత్తమా - నేటికి నీచే ఓటమెరిగితి 
ఈ నా ఓటమి లంకకు చేటని - పూర్వమే బ్రహ్మ వరమొసగేనని |
రావణుడాదిగా రాక్షసులందరూ - సీత మూలమున అంతమొందేదరు
ఇది నిజమోయని నీదే జయమని - లంకా రాక్షసి పంపే హరీశుని ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నీ పలికెద సీతారామకథా 

కోటగోడ అవలీలగా ప్రాకెను - కపి కిశోరుడు లోనికి ద్రుమికెను
శత్రు పతనముగా వామ పాదమును - ముందుగ మోపెను ముందుకు సాగెను |
ఆణిముత్యముల తోరణాలు గల - రమ్యమైన రాజవీధుల
వెన్నెలలో లంకాపురి శోభను - శోధనగా హరీశుడు గాంచెను ||

సువర్ణమయ సౌద రాజముల - ధగ ధగ మెరసే ఉన్నత గృహముల
కళకళ లాడే నవ్వుల జల్లులు - మంగళ కరమౌ నృత్య గీతములు |
అప్సరసల మరపించు మదవతుల - త్రిష్టాయి గొలుపు గానమాదురులు 
వెన్నెలలో లంకాపురి శోభను - శోధనగా హరీశుడు గాంచెను ||

సుందరమైన హేమ మందిరము - రత్న కచితమౌ సింహ ద్వారము 
పతాకాంకిత ధ్వజాకీర్ణము  - నవరత్న కాంతి సంకీర్ణము |
నృత్య మృదంగ గంభీర నాదితము - వీణా గాన వినోద సంకులము
లంకేశ్వరుని దివ్య భవనమది - శోధనగా హరీశుడు గాంచెను ||

అత్తరు పన్నీట జలకములు - కాలాగరు సుగంధ ధూపములు
స్వర్ణ ఛత్రములు వింధ్యా మరలు - కస్తూరి పునుగు జవ్వాజి గంధములు |
నిత్య పూజలు శివార్చనలు - మాస పర్వముల హోమములు 
లంకేశ్వరుని దివ్య భవనమది - శోధనగా హరీశుడు గాంచెను ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నీ పలికెద సీతారామకథా 

యమ కుబేర వరుణ దేవేంద్రాదుల - సర్వ సంపదల మించినది 
విశ్వ కర్మ తొలుత బ్రహ్మ కిచ్చినది - బ్రహ్మ వరమున కుబెరుడందినది |
రావణుండు కుబేరుని రణమందు - ఓడించి లంకకు కొని తెచ్చినది 
పుష్పకమను మహా విమానమది - మారుతి గాంచెను అచ్చెరువొందేను ||

నేలను తాకక నిలిచి యుండునది - రావణ భవన మధ్యంబుననున్నది 
వాయు పథమున ప్రతిష్టిత మైనది - మనమున తలచిన రీతి పోగలది|
దివినుండి భువికి దిగిన స్వర్గమది - సూర్య చంద్రులను దిక్కరించునది 
పుష్పకమను మహా విమానమది - మారుతి గాంచెను అచ్చెరువొందేను ||

లంకాదీశుని ప్రేమమందిరము - రత్న కచితమౌ హేమ మందిరము
చందనాది సుగంధ బంధురము - పానభక్ష్య పదార్థ సమృద్ధము |
ఆయా పరిమళ రూపానిలము - అనిలాత్మజుచే ఆఘ్రానితము
పుష్పకమందు రావణ మందిరమ్మది- మారుతి గాంచెను అచ్చెరువొందే ||

మత్తున శయనించు సుదతుల మోములు - పద్మములనుకుని మువ్వు భ్రమరములు 
నిమీళిత విశాల నేత్రములు - నిశా ముకుళిత పద్మ పత్రములు |
ఉత్తమ కాంతల కూడి రావణుడు - తారాపతి వలె తీజరిల్లెడు
పుష్పకమందు రావణ మందిరమ్మది - మారుతి గాంచెను అచ్చెరువొందే ||

రావణుండు రణమందున గెలిచి - స్త్రీలెందరినో లంకకు జేర్చెను
పిత్రుదైత్య గంధర్వ కన్యలు - ఎందెందరో రాజర్షి కన్యలు |
సీత దక్క వారందరూ కన్యలే - రావణు మెచ్చి వరించిన వారలే 
పుష్పకమందు రావణ మందిరమ్మది - మారుతి గాంచెను అచ్చెరువొందే ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నీ పలికెద సీతారామకథా 

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నీ పలికెద సీతారామకథా 

ఐరావతము దంతపు మొనలతో - పోరున బోడచిన గంటులతో
వజ్రాయుధపు ప్రభాతముతో - చక్రాయుధపు ప్రహరనములతో |
జయ పరంపరల గురుతులతో - కీర్తి చిహ్నముల కాంతులతో 
లంకేశుడు శయనించే కాంతలతో - సీతకై వెతకే మారుతి ఆశతో ||

మినప రాశి వలె నల్లని వాడు - తీక్షణ దృక్కుల లోహితాక్షుడు
రక్తచందనా చర్చిత గాత్రుడు - సంధ్యారుణ ఘన తేజోవంతుడు |
సతుల గూడి మధు బ్రోలిన వాడు - రతికేళి సలిపి సోలిన వాడు 
లంకేశుడు శయనించే కాంతలతో - సీతకై వెతకే మారుతి ఆశతో ||

అందొక వంక పర్యంకము జేరి - నిదురించుచుండే దివ్యమనోహరి
నవరత్న ఖచిత భూషణ ధారిణి - నలువంకలను కాంతి ప్రసారిణి |
స్వర్ణ దేహిని చారు రూపిణీ - రాణులకు రాణి పట్టపు రాణి
లంకేశుని హృదయేశ్వరి - మండోదరి లోకోత్తర సుందరి ||

మండోదరిని జానకి యనుకుని - ఆడుచు పాడుచు గంతులు పెట్టి 
వాలము బట్టి ముద్దులు పెట్టి - నేలను గొట్టి భుజములు తట్టి |
స్థంభములెగసి క్రిందకు దుమికి - పల్లటీలు గొట్టి చెంగున దుమికి 
చంచలమౌ కపీశ్వ భావమును పవన తనయుడు ప్రదర్శన చేసెను ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నీ పలికెద సీతారామకథా

రాముని సీతా ఇటులుండునా ?
రాముని సీతా ఇటులుండునా ? - రావణు జేరి శయనించునా?
రాముని బాసి నిదురించునా ? భుజియించునా భూషణముల దాల్చునా ? |
పరమ పురుషుని రాముని మరచునా ? పరపురుషునితో కాపురముండునా ?
సీత కాదు కాదు కానే కాదని - మారుతీ వగచుచు వెతక సాగెను ||

పోవగ రాని తావుల బోతి - చూడగ రానివి ఎన్నో జూచితి
నగ్నముగా పరున్న పరకాంతల - పరిశీలనగా పరికించితిని |
రతికేళి సలిపి సోలిన రమణుల - ఎందెందరినో పొడగాంచితిని
ధర్మము గానని పాపినైతినని - పరితాపముతో మారుతి క్రుంగెను ||

సుదతుల తోడ సీత యుండగా - వారల జూడక వెదకుటేలాగా 
మనసున ఏమి వికారము నొందక - నిష్కామముగా వివేకము వీడక |
సీతను వెదకుచు చూచితి గాని - మనసున ఏమి పాపమెరుగనని
స్వామి సేవ పరమార్థముగా గొని - మారుతి సాగెను సీత కోసమని ||

భూమీ గృహములు నిశా గృహములు - క్రీడా గృహములు లతా గృహములు
ఆరామములు చిత్రశాలలు - బావులు తిన్నెలు రచ్చ వీధులు |
మేడలు మిద్దెలు ఇల్లు కోనేళ్ళు - సందులు గొందులు బాటలు తోటలు
ఆగి ఆగి అడుగడుగునా వెదకుచు - సీతను గానక మారుతి వగచే ||

సీతా మాత బ్రతికి యుండునో - క్రూర రాక్షసుల పాల్పడి యుండునో
తాను పొందని సీత ఎందుకని - రావణుడే హత మార్చి యుండునో |
అని యోచించుచు అంతట వెదకుచు - తిరిగిన తావుల తిరిగి తిరుగుచు
ఆగి ఆగి అడుగడుగునా వెదకుచు - సీతను గానక మారుతి వగచే ||

సీత జాడ కనలేదను వార్తను - తెలిపిన రాముడు బ్రతుక జాలడు
రాముడు లేనిదే లక్ష్మణుడుండడు - ఆపై రఘుకుల మంతయు నశించు |
ఇంతటి ఘోరము కాంచినంతనే - సుగ్రీవాదులు మడియక మానరు
అని చింతించుచుపుష్పకము వీడి - మారుతి చేరే ప్రాకారము పైకి ||

ఇంత వినాశము నావల్ల నేను - నీ కిష్కింధకు పోనే పోను
వానప్రస్థాశ్రమవాసుడనై - నియమ నిష్ఠలతో బ్రతుకు వాడనై |
సీతా మాతను జూచి తీరెదను - లేకున్న నేను అగ్ని దూకెదను
అని హనుమంతుడు కృత నిశ్చయుడై - నలుదెసల గనే సాహస వంతుడై ||

చూడమరచిన అశోక వనమును - చూపు మేరలో మారుతి గాంచెను
సీతారామ లక్ష్మణాదులకు - ఏకాదశ రుద్రాది దేవులకు |
ఇంద్రాది యమ వాయు దేవులకు - సూర్య చంద్ర మరుద్గణములకు
వాయు నందనుడు వందనములిడి - అశోక వని చేరెను వడి వడి ||

శ్రీ హనుమానుగురు దేవులు నా ఎద పలికిన సీతారామ కథా
నీ పలికెద సీతారామకథా

విరి తేనియలు బ్రోలు భ్రుంగములు - విందారగ సేయు ఝంకారములు
లేజివురాకుల మెసవు కోయిలలు - పంచమ స్వరముల పలికే పాటలు |
పురులు విప్పి నాట్యమాడు నెమలులు - కిల కిల లాడే పక్షుల గుంపులు 
సుందరమైన అశోక వనమున - మారుతి వెదకెను సీతను కనుగొన ||

కపికిశోరుడు కొమ్మ కొమ్మను - ఊపుచూ ఊగుచూ దూకసాగెను
పువ్వులు రాలెను తీవెలు తెగెను - ఆకులు కొమ్మలు నేలపై బడెను |
పూలు పైరాల పవన కుమారుడు - పుష్ప రథము వలె వనమున దోచెడు
సుందరమైన అశోక వనమున - మారుతి వెదకెను సీతను కనుగొన ||

పూవులనిన పూ తీవియలనిన - జానకి కెంతో మనసౌనని 
పద్మ పత్రముల పద్మాక్షుని గన - పద్మాకరుల  పొంత జేరునని |
అన్ని రీతుల అనువైనదని - అశోక వని సీత యుండునని
శోభిల్లు శింశుప తరు శాఖలపై - మారుతి కూర్చొని కలయ జూచెను ||

శ్రీ హనుమను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతా రామ కథా 

సుందరమైన అశోకవనమున - తను కూర్చొనిన తరువు క్రిందున 
క్రుంగి కృశించిన సన్న గిల్లిన - శుక్ల పక్షపు శశి రేఖను |
ఉపవాసముల వాడి పోయిన - నివురు కప్పిన నిప్పు కణమును 
చిక్కిన వనితను మారుతి గాంచెను - రాక్షస వనితల క్రూర వలయమున ||

మాసిన పీత వసనమును దాల్చిన - మన్నున పుట్టిన పద్మమును 
పతివియోగ శోకాగ్ని వేగిన - అంగారక పీడిత రోహిణిని |
మాటి మాటికీ వేడి నిట్టూర్పుల - సెగలను గ్రక్కే అగ్ని జ్వాలను 
చిక్కిన వనితను మారుతి గాంచెను - రాక్షస వనితల క్రూర వలయమున ||

నీలవేణి సంచాలిత జఘనను - సుప్రతిష్ఠను సింహమధ్యను
కాంతులొలుకు ఏకాంతప్రశాంతను - రతీదేవి వలె వెలయు కాంతను |
పుణ్యము తరిగి దివి నుండి జారి - శోక జలధి పది మునిగిన తారను 
చిక్కిన వనితను మారుతి గాంచెను - రాక్షస వనితల క్రూర వలయమున ||

పతిచెంత లేని సతి కేలనని - సీత సోమ్ములదగిల్లె శాఖల
మణిమయ కాంచన కర్ణ వేష్టములు - మరకత మాణిక్య చెంప సరాలు |
రత్న ఖచితమౌ హస్త భూషలు - నవరత్నాంకిత మణిహారములు
రాముడు తెలిపిన గురుతులు గలిగిన - ఆభరణముల గుర్తించే మారుతి ||

సర్వ సులక్షణ లక్షిత జాత - సీత గాక మరి ఎవరీ మాత 
కౌసల్యా సుప్రజా రాముని - సీత గాక మరి ఎవరీ మాత |
వనమున తపించు మేఘ శ్యాముని - సీత గాక మరి ఎవరీ మాత
ఆహా కంటి కనుగొంటి సీతనని - పొంగి పొంగి ఉప్పొంగే మారుతి ||

శ్రీ హనుమను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతా రామ కథా

పువ్వులు నిండిన పొలములందున  - నాగేటి చాలున జననమందిన 
జనక మహారాజు కూతురైన - దశరథ నరపాలు కోడలైన |
సీతా లక్ష్మి కి కాదు సమానము - త్రైలోక్య రాజ్య లక్ష్మీ  సహితము
అంతటి మాతకా కాని కాలమని - మారుతి వగచే సీతను కనుగొని ||

శత్రు తాపకరుడు మహా శూరుడు - సౌమిత్రికి పూజ్యురాలైన
ఆశ్రిత జన సంరక్షకుడైన - శ్రీ రఘు రాముని ప్రియ సతియైన |
పతి సన్నిధియే సుఖమని ఎంచి - పడునాల్గేండ్లు వనమునకేగిన
అంతటి మాతకా కాని కాలమని - మారుతి వగచే సీతను కనుగొని ||

బంగారు మేని కాంతులు మెరయ  - మందస్మిత ముఖ పద్మము విరియ
హంస తూలికా తల్పమందున - రాముని గూడి సుఖింపక దగిన|
పురుషోత్తముని పావన చరితుని - శ్రీ రఘు రాముని ప్రియ సతియైన
అంతటి మాతకా కాని కాలమని - మారుతి వగచే సీతను కనుగొని ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా 

మూడు ఝాములా రేయి గడువగా - నాల్గవ ఝాము నడచుచుండగా 
మంగళ వాయిద్య మనోహర ధ్వనులు - లంకేశ్వరుని మేలుకొల్పులు |
క్రతువులొనర్చు షడంగ వేద విధుల - స్వరయుత శబ్ద తరంగ ఘోషలు 
శోభిల్లు శింశుపా శాఖలందున - మారుతి కూర్చొని ఆలపించెను ||

రావణాసురుడు శాస్త్రోక్తముగా - వేకువనే విధులన్నీ యొనర్చెను
మదోత్కటుడై మదన తాపమున - మరి మరి సీతను మదిలోనెంచెను |
నూర్గురు భార్యలు సురకన్యల వలె - పరిసేవింపగా  దేవేంద్రుని వలె 
దశకంఠుడు దేదీప్యమానముగా - వెడలెను అశోకా వనము చేరగా ||

లంకేశునితో వెడలిరి సతులు - మేఘము వెంట విద్యుల్లతల వలె 
మధువు బ్రోలిన పద్మ ముఖుల - మ్రుంగురులు రేగే భ్రుంగముల వలె 
క్రీడల త్రేలిన కామినీ మణులు - నిద్రలేమి పడు అడుగులు తూలె 
దశకంఠుడు దేదీప్యమానముగా - చేరెను అశోకా వనము వేగముగా ||

లంకేశుని మహా తేజమును గని - మారుతి కూడ దిగ్భ్రాంతి చెందెను
దశకంఠుడు సమీపించి నిలచెను - సీత పైననే చూపులు నిలిపెను 
తొడలు చేర్చుకుని కడుపును దాచి - కరములు ముడిచి చనుగవ గాచి 
సుడిగాలి పడిన కడలీ తరువు వలె - కటిక నేలపై జానకి తూలె ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా

ఓ సీతా ఓ పద్మనేత్రా - నా చెంత నీకు ఏల చింత
ఎక్కడి రాముడు ఎక్కడి అయోధ్య - ఎందుకోసమీ వనవాస వ్యధ |
నవ యవ్వన త్రిలోక సుందరి - నీకెందుకు ఈ మునివేషధారీ
అని రావణుడు కామాంధుడై నిలిచే - నోటికి వచ్చిన దెల్ల పల్కే ||

రాముడు నీకు సరిగాని వాడు - నిను సుఖ పెట్టడు తను సుఖ పడడు
గతి చెడి వనమున తిరుగుచుండెనో - తిరిగి తిరిగి తుదకు రాలిపోయెనో |
మరచి పొమ్ము ఆ కొరగాని రాముని - వలచి రమ్ము నను యశో విశాలుని 
అని రావణుడు కామాంధుడై నిలిచే - నోటికి వచ్చిన దెల్ల పల్కే ||

రాముడు వచ్చుట నన్ను గెల్చుట - నిన్ను పొందుట కలలోని మాట
బలవిక్రమ ధన యశములందున - అల్పుడు రాముడు నా ముందెందున |
యమ కుబేర ఇంద్రాది దేవతల - గెల్చిన నాకిల నరభయమేల?
అని రావణుడు కామాంధుడై నిలిచే - నోటికి వచ్చిన దెల్ల పల్కే ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా 

నిరతము పతినే మనమున తలచుచు - క్షణమొక యుగముగా కాలము గడపుచు 
రావణ గర్వమదంబుల ద్రుంచు - రాముని శౌర్య ధైర్యముల దలచుచు |
శోకతప్తయై శిరమును వంచి - త్రుణమును త్రుంచి తనమున్దుంచి
మారు పల్కే సీత దీన స్వరమున - తృణము కన్నా రావణుడే హీనమన ||

రామలక్ష్మణులు లేని సమయమున - అపహరించితివే నను ఆశ్రమమున
పురుష సింహముల గాలికి బెదిరి - పారిపోతివి శునకము మాదిరి |
యమకుబేర ఇంద్రాది దేవతల - గెలిచిన నీకీ వంచనలేల?
మారు పల్కే సీత దీన స్వరమున - తృణము కన్నా రావణుడే హీనమన ||

ఓయి రావణా నా మాట వినుము - శ్రీరామునితో వైరము మానుము 
శీఘ్రముగా నను రాముని జేర్చుము - త్రికరణ శుద్ధిగా శరణు వేడుము |
నిను మన్నించి అనుగ్రహింపుమని  - కోరుకొందు నా కరుణా మూర్తిని 
అని పల్కే సీత దీన స్వరమున - తృణము కన్నా రావణుడే హీనమన ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతారామ కథా 
నే పలికెద సీతారామ కథా

ఓ సీతా నీవెంత గడసరివే - ఎవరితో ఏమి పల్కుచుంటివే?
ఎంతటి కర్ణ కఠోర వచనములు - ఎంతటి ఘోర అసభ్య దూషణలు|
నీపై మోహము నను బంధించెను - లేకున్న నిన్ను వధించియుందును
అని గర్జించెను ఘనతరగాత్రుడు - క్రోధో దీప్తుడై దశకంఠుడు ||

నీకొసగినc ఏడాది గడువును - రెండునెలలలో ఇక తీరిపోవు
అంతదనుక నిన్నంటగా రాను - ఈ లోపున బాగోగులు కనుగొను |
నను కోరని నిను బలాత్కరించను - నను కాదను నిను కనికరించను
అని గర్జించెను ఘనతరగాత్రుడు - క్రోధో దీప్తుడై దశకంఠుడు ||

ఓ రావణా నీ క్రొవ్విన నాలుక - గిజగిజలాడి తెగి పడదేమి?
కామాంధుడా నీ క్రూర నేత్రములు - గిరగిర తిరిగి రాలి పడవేమి?
పతి యాజ్ఞ లేక ఇటులుంటి గాని - త్రుటిలో నిను దహింపనా ఏమి?
అని పల్కే సీత దివ్య స్వరమున - తృణము కన్నా రావణుడే హీనమన ||

క్రోధాగ్నిరగుల రుసరుస లాడుచూ - కొరకొర చూచుచూ నిప్పులు గ్రక్కుచూ
తన కాంత లెల్ల కలవరమొందగా - గర్జన సేయుచూ దిక్కులదరగా |
సీతనేటులైన ఒప్పించుడనీ - ఒప్పుకొననిచో భక్షించుడనీ
రావణాసురుడు అసుర వనితలను - అజ్ఞాపించీ మరలీ పోయెను ||

శ్రీ హనుమాను గురుదేవులు నా ఎద పలికిన సీతా రామ కథా 
నే పలికెద సీతా రామ కథా

అందున్న ఒక వృద్ధ రాక్షసి - తోటి రాక్షసుల ఆవల ద్రోలి
కావలెనన్న నన్ను వధించుడు - సీతను మాత్రం హింసింపకుడు |
దారుణమైన కలగంటి నేను - దానవులకది ప్రళయమ్మేను
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

శుక్లాంబరములు దాల్చిన వారు - రామలక్ష్మణులు అగుపించినారు 
వైదేహికి ఇరువంకల నిలిచి - దివ్య తేజమున వెలుగొంది నారు |
తెల్లని కరిపై మువ్వురు కలసి - లంకా పురిపై పయనించినారు 
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

దేవతలందరు పరిసేవింప - ఋషిగణంబులు అభిషేకింప
గంధర్వాదులు సంకీర్తింప - బ్రహ్మాదులు మునుముందును దింప|
సీతారాముడు విష్ణు దేవుడై - శోభిల్లెను కోటి సూర్య తేజుడై
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

తైలమలదుకొని రావణాసురుడు - నూనె త్రాగుచూ అగుపించినాడు 
కాలాంబరమును ధరియించినాడు - కర వీరమాల దాల్చినాడు |
పుష్పకమందుండి నేలబడినాడు - కడకొక స్త్రీచే ఈడ్వబడినాడు
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

రావణుండు వరాహము పైన - కుంభకర్ణుడు ఒంటె పైన
ఇంద్రజిత్తు మకరము పైన - దక్షిణ దిశగా పడి పోయినారు |
రాక్షసులందరూ గుంపు గుంపులుగా - మన్నున కలిసిరి సమ్మూలమ్ముగా
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

తెల్లని మాలలు వలువలు దాల్చి - తెల్లని గంధము మేన బూసుకొని
నృత్య మృదంగ మంగళాధ్వనులతో - చంద్రకాంతులెగజిమ్ము ఛత్రముతో |
తెల్లని కరి పై మంత్రి వర్యులతో - వెడలె విభీషణుడు దివ్య కాంతితో
అని తెల్పె త్రిజట స్వప్న వృత్తాంతము - భయకంపితలయిరి రాక్షసీగణము ||

విశ్వకర్మ నిర్మించిన లంకను - రావణుండు పాలించెడు లంకను
రామ దూత ఒక వానరోత్తముడు - రుద్ర రూపుడై దహియించినాడు |
ప్రళయ భయానక సద్రుశమాయెను - సాగరమున లంక మునిగి పోయెను 
అను పల్కు త్రిజట మాటలు వినుచూ - నిద్ర తూలిరి రాక్షస వనితలు ||

హృదయ తాపమును జానకి తూలుచూ - శోక భారమున గడ గడ వణకుచూ
జరగి జరగి అశోక శాఖలను - ఊతగా గొని మెల్లగా నిలిచి |
శ్రీరాముని కడసారి తలచుకొని - తన మెడ జడతో ఉరిబోసుకొని 
ప్రాణత్యాగము చేయబూనగా - శుభ శకునములు తోచే వింతగా||

సీత కెంత దురవస్థ ఘటిల్లె - నా తల్లి నెటుల ఊరడించవలె
నన్ను నేనెటుల తెలుపుకోవలె - తల్లి నెటుల కాపాడుకోవలె |
ఏ మాత్రము నే ఆలసించినా - సీతా మాత ప్రాణములుండునా?
అని హనుమంతుడు శాఖల మాటున - తహ తహ లాడుచూ మెదల సాగెను||

నను గని జానకి బెదరక ముందే - పలికెద సీతా రామ కథా 
సత్యమైనది వ్యర్థము గానిది  - పావనమైనది శుభకరమైనది |
సీతా మాతకు కడుప్రియమైనది - పలుకు పలుకునా తేనెలొలుకునది
అని హనుమంతుడు మృదు మధురముగా - పలికెను సీతా రామ కథా ||

దశరథ విభుడు రాజోత్తముడు - యశము గొన్న ఇక్ష్వాకు వంశజుడు
దశరధునకు కడు ప్రియమైన వాడు - జ్యేష్ఠ కుమారుడు శ్రీ రఘు రాముడు |
సత్య వంతుడు జ్ఞాన శ్రేష్ఠుడు - పిత్రు వాక్య పరిపాలన శీలుడు 
అని హనుమంతుడు మృదు మధురముగా - పలికెను సీతా రామ కథా ||

శ్రీ రాముని పట్టాభిషేకము - నిర్ణయమైన శుభ సమయమున 
చిన్న భార్య కైక దశరదు చేరి - తనకోసగిన రెండు వరములు కోరే | 
భరతునకు పట్టాభిషేకము - పడునాల్గేండ్లు రామ వనవాసము 
అని హనుమంతుడు మృదు మధురముగా - పలికెను సీతా రామ కథా ||